శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియం 34వ ఆత్మీయ సమ్మేళన వేడుకలను ప్రారంభించిన శ్రీరాంపూర్ ఏరియా జిఎం శ్రీనివాస్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు. అలయ్ బాలయ్ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు, కళాకారులు, సింగరేణి అధికారులు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ బస్టాండ్ నుండి ప్రగతి స్టేడియం వరకు క్రీడాకారులు కార్మికులు ర్యాలీ నిర్వహించి జ్యోతి ప్రజల చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ 34 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రగతి స్టేడియం, శ్రీరాంపూర్ లో అధికారులు, క్రీడాకారులు మరియు కార్మికుల సమక్షంలో ఘనంగా 34వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.ప్రగతి స్టేడియం స్థాపన 12-02-1992 న జరిగిందని, అప్పటి నుంచి ఈ స్టేడియం అనేక మంది క్రీడాకారులకు శిక్షణ కేంద్రంగా మారిందని చెప్పారు.

ఈ స్టేడియంలో శిక్షణ పొందిన క్రీడాకారులు నేడు ఉన్నతమైన స్థానాల్లో ఉద్యోగాలు పొందారని, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచారని పేర్కొన్నారు.అధికారులు, కార్మికులు, క్రీడాకారుల ఐక్యతతో ఈ స్టేడియం అభివృద్ధి చెందిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు, కార్మికులు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. గ్రౌండ్‌లో శిక్షణ పొందిన రోజులు, పోటీలు, విజయాలు, పరాజయాలు అన్నీ తమ జీవితంలో కీలక మలుపులు తీసుకువచ్చాయని తెలిపారు.శ్రామిక భవిష్యత్తు కోసం అధికారులు, క్రీడాకారులు మరియు కార్మికులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రగతి స్టేడియం మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముస్కే సమ్మయ్య,బ్రాంచ్ సెక్రెటరీ బాజీ సైదా, అధికారులు క్రీడాకారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
