HomeసినిమాMahavatar Parshuram | మూవీ అనౌన్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్

Mahavatar Parshuram | మూవీ అనౌన్స్ చేసిన హోంబలే ఫిల్మ్స్

భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిల్మ్స్, ‘రాజకుమార’, ‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘సలార్’, ఇటీవల వచ్చిన ‘మహావతార్ నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సినిమా స్థాయి, స్టోరీ టెల్లింగ్ ని రీడిఫైన్ చేసింది. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మరో శక్తివంతమైన అధ్యాయంగా ‘మహావతార్ పరశురామ్’ను తీసుకువస్తోంది. భక్తి, యాక్షన్‌తో ఆకట్టుకున్న ‘మహావతార్’ విజయానంతరం, ఈ కొత్త భాగంతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది.

పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్మెంట్, ‘మహావతార్’ సినీమాటిక్ యూనివర్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం, పరశురాముడి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించనుంది. పురాణ గాథలతో పాటు ఆధునిక విజువల్ టెక్నాలజీని కలిపి ఒక కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

- Advertisement -
Mahavatar Parshuram Official Announcement Poster10

టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. పరశురాముడి ముఖాన్ని చూపించకుండా, ఆయన చేతిలో రక్తంతో తడిసిన పరశును (గొడ్డలి) యుద్ధభూమి మధ్యలో చూపించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. పడిపోయిన యోధులు, ధూళితో నిండిన వాతావరణం, దూరంలో కనిపించే యుద్ధ దృశ్యాలు.. భారీ విధ్వంసం, డివైన్ జస్టిస్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. ‘When Dharma Falls, the Parshu Rises,“ ట్యాగ్‌లైన్ ఈ చిత్ర సారాంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

గ్లింప్స్ కూడా అంచనాలను మరింత పెంచుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉంది. సామ్ సిఎస్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ను మరింత ఎలివేట్ చేసింది.

భారీ యానిమేటెడ్ స్పెక్టాకిల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, ఆధునిక టెక్నాలజీతో భారతీయ సంస్కృతి, పురాణాలను మిళితం చేస్తూ గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్ అందించబోతుంది. విష్ణువు అవతారాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథ మోడ్రన్ విజువల్ వండర్ గా అలరించబోతుంది. 2027లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘మహావతార్ పరశురామ్’, ఈ ఫ్రాంచైజ్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనుంది. విజువల్ గా ఎమోషన్స్ పరంగా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News