- 36.8 లక్షల టన్నుల ఖనిజ విక్రయం..
ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ 46.4 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 36.8 లక్షల టన్నుల ఖనిజాన్ని విక్రయించింది. అంతక్రితం ఏడాది ఉత్పత్తి చేసిన దానికంటే 16 శాతం అధికమని పేర్కొంది. బైలదిల్లా ఇనుప ఖనిజ ప్రాజెక్టు అంచనాలకుమించి రాణించడం వల్లనే ఇది సాధ్యమైందని కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు.
- Advertisement -
