- ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా రాయాలి..Telangana SI Exam
- టీజీపీఆర్సీ చైర్మన్ శ్రీనివాసరావు సూచనలు..
తెలంగాణలో నవంబర్ 29న జరగనున్న ఎస్‌ఐ పరీక్షకు (Telangana SI Exam) హాజరయ్యే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్బీ) ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు సూచించారు. పరీక్షను ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయాలంటే ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా హాల్‌టికెట్, పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయం, అనుమతించే వస్తువులు, ఓఎంఆర్ షీట్ నింపే విధానం విషయంలో అభ్యర్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగా తమ హాల్‌టికెట్‌తో పాటు అందులోని ముఖ్య సూచనలను ఒకే ఏ4 పేజీపై ముందు, వెనుక వైపులా ప్రింట్ తీసుకోవాలి. వీలైతే కలర్ ప్రింట్ తీసుకోవడం మంచిదని సూచించారు.
దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను హాల్‌టికెట్ మొదటి పేజీకి ఎడమవైపు కింది భాగంలో గమ్‌తో అతికించాలి. ఫొటోను అతికించేందుకు స్టేపులర్ లేదా పిన్‌లు ఉపయోగించకూడదు. పరీక్షకు చివరి నిమిషంలో హడావుడి పడకుండా ఉండేందుకు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అవసరమైతే అక్కడికి వెళ్లే మార్గాన్ని ముందుగానే పరిశీలించుకోవాలి. దీంతో పరీక్ష రోజున కేంద్రాన్ని వెతుక్కుంటూ సమయం వృథా కాకుండా ఉంటుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
