- 2027-28 లోనూ పాత పాఠ్యప్రణాళికతోనే తరగతులు..Telangana Old Syllabus
- కొత్త సిలబస్ రూపకల్పనపై కనిపించని పురోగతి..
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు మరోసారి పాత సిలబస్సే అమలు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం (2027-28)లోనూ పాత పాఠ్య ప్రణాళికతోనే తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సిలబస్ రూపకల్పనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది మే నెలలోనే అనుమతి ఇచ్చినా.. ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. తాజాగా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగానికి పాత సిలబస్సునే అందజేయడం చర్చనీయాంశంగా మారింది.Telangana Old Syllabus
తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్‌ను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ – 2005 ఆధారంగా 2015లో రూపొందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాఠ్య ప్రణాళికను మార్చలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు పాఠ్యపుస్తకాల్లో అక్కడక్కడా కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే సవరించారు. కానీ మొత్తం సిలబస్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. దీంతో పదేళ్లు దాటినా విద్యార్థులు పాత పాఠ్య ప్రణాళికతోనే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
