ఆంధ్రప్రదేశ్(AndhraPradesh)లో పెట్టుబడులు (Investments) పెట్టేవారికి ప్రభుత్వం (Government) పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని మంత్రి నారాయణ (Minister Narayana) దుబాయ్ పారిశ్రామికవేత్తల(Industrialists)కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను (Policies) పరిశీలించిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ.. అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నారు. గత 15 నెలలుగా వచ్చిన పెట్టుబడులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది గురించి పెట్టుబడిదారులకు వివరిస్తున్నారు. వ్యాపారాభివృద్దికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ ఉందనే విషయాన్ని వివరించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Dubai | రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన
RELATED ARTICLES
- Advertisment -

