Homeవరంగల్‌ప్లాస్టిక్ రహిత శారి ఫంక్షన్ విందును ఆరగించిన నర్సంపేట ఎమ్మెల్యే

ప్లాస్టిక్ రహిత శారి ఫంక్షన్ విందును ఆరగించిన నర్సంపేట ఎమ్మెల్యే

  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడొద్దు..
  • ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన అంకాల దుర్గాప్రసాద్ కూతురి సారీ ఫంక్షన్ కు విచ్చేసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి వారి అమ్మాయిని ఆశీర్వదించారు.వారు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత విస్తరాకు ప్లేట్స్ లో విందునుస్వీకరించారు..
అనంతరం ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి మాట్లాడుతూ..

ప్లాస్టిక్ రహితం గా విందును విస్తరాకు ప్లేట్స్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు..విందుకు విచ్చేసిన వారందరి ఆరోగ్యాన్ని రక్షించినవారయ్యారని వారిని అభినందించారు..

- Advertisement -
Narsampet MLA Donthi Madhava Reddy Encourages Plastic Free Celebrations1 1

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్స్ ,కవర్ ల లో వేడివేడి ఆహారం తీసుకొని అనారోగ్య పాలు కావొద్దన్నారు..ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి గాలి,నీరు,భూమి నీ కలుషితం చేయొద్దన్నారు.. ప్లాస్టిక్ రహిత విందు ఏర్పాటుకు సహకరించిన ఏ.ఎస్.ఆర్ స్వచ్ఛంద సంస్థనిర్వాహకులు ఎర్రబోయినరాజశేఖర్ ను అభినందించారు. కార్యక్రమం లోడఫోడీల్స్ స్కూల్ చైర్మన్ చింతల నరేందర్,నిరంజన్,పెండెం రామానంద్,లక్ష్మణ్,అంకాలసాంబయ్యా,వేములసాంబయ్యా,నాయకులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News