- కట్టా సుధాకర్‌రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడి(Narendra Modi) 25 ఏళ్ల ప్రజాసేవ, పరిపాలన దేశానికి శ్రీరామరక్షగా నిలిచిందని శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు కట్టా సుధాకర్‌రెడ్డి అన్నారు. మోడి జన్మదినం సందర్భంగా(Modi Birthday Program) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాలపై నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalwakurthy) పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మున్సిపాలిటీ, మండల స్థాయి కార్యకర్తలకు శుక్రవారం కార్యశాల నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కట్టా సుధాకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…
నరేంద్ర మోడి తొలిసారిగాముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిది కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 17న మోదీ జన్మదినం నుంచి అక్టోబరు 17 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రధానికి పుట్టినరోజు కానుకగా అందించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం సాధారణ స్వయంసేవకుడిగా జీవించిన నరేంద్ర మోదీ నేడు ప్రపంచ నాయకుడిగా ఎదిగారని అన్నారు. హిందూ ధర్మానికి, దేశ సేవకు కట్టుబడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. మోదీతో పోటీపడే నాయకుడు దేశంలో లేరని, భవిష్యత్తులోనూ పుట్టబోరని అన్నారు.భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దే వరకు మోదీ నిరంతరం పనిచేస్తారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలు ముందుకు సాగాలని, దేశం విశ్వగురువుగా ఎదిగే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)
కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మోర్చా అధ్యక్షులు, పదాధికారులను శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో భాజపా కల్వకుర్తి మున్సిపాలిటీ, రూరల్ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్, మట్ట నరేష్‌గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గుండోజు గంగాధర్, జిల్లా సేవా సంకల్ప అభియాన్ కో-కన్వీనర్ బోడ నరసింహ, మున్సిపాలిటీ, రూరల్ కన్వీనర్లు నరేడ్ల శేఖర్‌రెడ్డి, సూర్యకృష్ణగౌడ్, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డి, అంజన్‌రెడ్డి, కురుమిద్ద సర్పంచ్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఎనుగొండ రామకృష్ణ, వరికుప్పల శ్రీరాములు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వాగుల్దాస్ నరేష్‌గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులు దేవర్ల మహేష్, పెద్దారి పర్వతాలు, బచ్చలకూర శ్రీశైలం, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వంశీ నాయక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కృష్ణయ్య, బొడ్డుపల్లి శ్రీకర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పరశురాములు, యువ మోర్చా అధ్యక్షుడు తోడేటి అరవింద్‌రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిరణ్‌రెడ్డి, మోతె హుస్సేన్, కోశాధికారి లక్ష్మీనరసింహ, నాయకులు బాలరాజుగౌడ్, మాయని రాజశేఖర్, ఆనంద్, వెంకటేష్, చింటూ, రంగయ్య, బూత్ అధ్యక్షులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
