Homeరంగారెడ్డిInspection | జవహర్‌నగర్‌లో జోనల్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

Inspection | జవహర్‌నగర్‌లో జోనల్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

  • కాలనీల సమస్యలపై అధికారులకు పలు ఆదేశాలు

జవహర్‌నగర్‌లో మల్కాజిగిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగావర్(Sanchit Gangwar) శుక్రవారం పలు కాలనీల్లో ఆకస్మికంగా(Inspection) పర్యటించారు. స్థానిక సీనియర్ బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ బాబు ఆయన వెంట ఉండి ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

భక్తబాయి, న్యూ వెంకటేశ్వర కాలనీ, ముత్తుస్వామి కాలనీల్లో ఓపెన్ నాలాల సమస్యను స్థానికులు కమిషనర్‌కు వివరించారు. స్పందించిన ఆయన ఓపెన్ నాలాల నిర్మాణ పనులను విడతల వారీగా చేపట్టి వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

లక్ష్మీ నరసింహస్వామి కాలనీ ఎదురుగా ఉన్న ఓరిని పూడ్చివేయడంతో వర్షపు నీరు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పూడ్చివేసిన ప్రాంతాలను పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను కమిషనర్ ఆదేశించారు.(https://epaper.aadabhyderabad.in/)

జవహర్‌నగర్‌లో నెలకొన్న ప్రధాన సమస్యలకు ప్రభుత్వ నిధులను విడతల వారీగా కేటాయించి, అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడతామని కమిషనర్ సంచిత్ గంగావర్ తెలిపారు.

కమిషనర్ ఆకస్మిక పర్యటనపై ఆయా కాలనీల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన వెంట నడుస్తూ తమ కాలనీల్లోని సమస్యలను నేరుగా వివరించి పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News