Homeఆదాబ్ ప్రత్యేకంShankarpally | శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అంతర్గత 'గరం'!

Shankarpally | శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అంతర్గత ‘గరం’!

  • శంకర్‌పల్లి మున్సిపల్ పాలనపై వైస్ చైర్‌పర్సన్ ఆవేదన
  • కమిషనర్ తనకు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వడం లేదని శ్వేతా పాండు రంగారెడ్డి ఆరోపణ
  • కీలక అంశాలపై సమాచారం ఇవ్వకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆవేదన
  • సింగాపురం,బుల్కాపూర్ నిర్మాణాలపై చర్యలేవీ?
  • మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో(Shankarpally Municipality) అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి కమిషనర్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై తనకు తగిన సమాచారం ఇవ్వడం లేదని, తనకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రాధాన్యం విషయంలో నిర్లక్ష్యం కని పిస్తోందని ఆమె ఆరోపించారు.

మున్సిపాలిటీ పరిధిలో తీసుకుంటున్న కొన్ని నిర్ణ యాలపై ముందస్తుగా సమాచారం లేకపోవడం వల్ల ప్రజాప్రతి నిధిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైస్ చైర్‌పర్సన్ పేర్కొ న్నట్లు తెలిసింది. అధికార యంత్రాంగం, పాలకవర్గం మధ్య సమన్వ యం ఉంటేనే పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం సక్రమంగా జరుగుతుందని ఆమె అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

నిర్మాణాలపై పర్యవేక్షణ ఎక్కడ? : ఇదిలా ఉండగా శంకర్‌పల్లి మున్సిపాలిటీ(Shankarpally Municipality) పరిధిలోని సింగాపురం,బుల్కాపూర్ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు చెబుతున్న పలు నిర్మాణాలపై వైస్ చైర్‌పర్సన్ స్పందించారు.ఆయా నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? మున్సిపల్ నిబంధనలు పాటిస్తున్నారా? సంబంధిత శాఖల నుంచి అవసరమైన క్లియరెన్స్‌లు తీసుకున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె కోరుతున్నారు.

అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు, లేఅవుట్ నిబంధనలు, పర్యావరణ సంబంధిత అంశా లపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్త వాలను వెల్లడిం చాల్సిన అవసరం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్న ప్పుడు వాటిని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకో వడం అధికారుల బాధ్యతగా ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రజాప్రతినిధులకు సమాచారం ఎందుకు లేదు? : మున్సిపల్ పరిధిలోని కీలక అంశాలపై పాలకవర్గం లోని ప్రజాప్రతినిధులకు సమాచారం అందించడం,వారి సూచ నలు తీసుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వైస్ చైర్‌పర్సన్ అభిప్రాయపడుతు న్నారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మున్సిపల్ పాలనలో అంతర్గత సమన్వయంపై చర్చకు దారితీశాయి.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, నిర్మాణాలపై అభ్యంతరాలు, అనుమతుల అంశాలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా రికార్డుల ఆధారంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలా పాలు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ పర్యవేక్షణ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చర్యలు ఎప్పుడంటూ ప్రశ్నలు : సింగాపురం,బుల్కాపూర్ ప్రాంతా ల్లోని నిర్మాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, అనుమతులు మరియు నిబంధనల అమలుపై స్పష్టత ఇవ్వాలని వైస్ చైర్‌పర్సన్ కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో మున్సిపల్ పాలనలో అధికారులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధి చేసిన ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తేనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కమిషనర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News