- ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం
- శాంతియుతంగా గణపతి నవరాత్రులు నిర్వహించాలి: సీఐ సైదిరెడ్డి
గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో,భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కడ్తాల్ సీఐ సైదిరెడ్డి గణేష్ ఉత్సవ కమిటీలకు పిలుపునిచ్చారు. గురువారం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని కడ్తాల్ పోలీస్ స్టేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ సైదిరెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలను(No DJs Allowed) ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఉత్సవ కమిటీలు పోలీసు శాఖ సూచనలు,ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.మండపాల వద్ద విద్యుత్ భద్రత,ట్రాఫిక్ నియంత్రణ,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

నిమజ్జనం సందర్భంగా ర్యాలీల నిర్వహణ,శబ్ద కాలుష్యం తదితర అంశాల్లో నిబంధనలు పాటించాలన్నారు.ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ ఉత్సవాలను సోదరభావంతో నిర్వహించాలని కోరారు.సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు,వివాదాస్పద పోస్టులను నమ్మవద్దని,ఎవరైనా కావాలనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.కడ్తాల్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని సీఐ సైదిరెడ్డి తెలిపారు.(epaper.aadabhyderabad.in)
ఉత్సవ కమిటీలు,ప్రజలు పోలీసులకు సహకరించి గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్,కడ్తాల్ సర్పంచ్ రాయికంటి బిక్షపతి,వార్డు సభ్యులు మంకీ మహేష్,బీసీ సంఘం మాజీ అధ్యక్షుడు పిప్పళ్ళ వెంకటేష్,నాయకులు దుడ్డు నాగరాజు,కర్రోళ్ల రమేష్, పెరుమాళ్ళ మల్లయ్య,జహంగీర్ అలీ,మాధవులు,మహేందర్ రెడ్డి,రావుల మహేష్,క్యామ మహేష్,ఓర్సు సురేష్,హరికృష్ణ,పోలీసు సిబ్బంది,వివిధ గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు,సభ్యులు పాల్గొన్నారు.
