- నిర్దిష్ట చికిత్స వల్ల రోగికి ప్రయోజనం ఉంటుందా..?
- కొనసాగుతున్న ప్రయోగాలు..
అండాశయ క్యాన్సర్(Ovarian Cancer) నిర్ధారణ అయిన మహిళలకు శస్త్రచికిత్స చేయాలా, కీమోథెరపీ అవసరమా, చికిత్స(Treatment) తర్వాత కోలుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతుంటాయి. అయితే ప్రస్తుతం మరో ముఖ్యమైన అంశం కూడా వైద్య రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అదే.. కణితిలోని జన్యు లక్షణాలు ఆ క్యాన్సర్కు ఏ చికిత్స మెరుగ్గా పనిచేస్తుందో తెలుసుకోవడంలో ఎంతవరకు సహాయపడతాయన్నది.
జన్యు పరీక్ష అంటే కేవలం వారసత్వంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా లేదా తెలుసుకోవడం మాత్రమే కాదు. కణితి ఎలా ప్రవర్తించే అవకాశం ఉందో, అలాగే నిర్దిష్ట చికిత్స వల్ల రోగికి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని అంచనా వేయడంలోనూ ఈ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది. అండాశయ క్యాన్సర్ ఒకే జన్యువులో వచ్చే మార్పు వల్ల ఏర్పడే వ్యాధి కాదు. వివిధ కణితుల్లో భిన్నమైన పరమాణు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రోగికి ఎలాంటి చికిత్స అందించాలనే నిర్ణయంపై ప్రభావం చూపుతాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
