విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. ప్లకార్డులు కాదు! స్కాలర్‌షిప్‌ల(Scholarship) కోసం విద్యార్థులు రోడ్డెక్కడం సిగ్గుచేటు! వేల కోట్లు బకాయిలు ఉంటే చదువులు ఎలా సాగాలి?పేద విద్యార్థి చదువుకు డబ్బు లేక ఇబ్బంది పడాలి..రాజకీయాలకు మాత్రం నిధులు కొరత ఉండదా?హామీలు ఇచ్చేది ఎన్నికల ముందు.. హక్కులు అడిగితే పోలీసులను పెట్టడం ఎందుకు? ప్రశ్నించిన విద్యార్థిని అడ్డుకోవచ్చు.. కానీ అతని భవిష్యత్తును అడ్డుకోగలరా? ప్రభుత్వం మారింది.. సమస్యలు మాత్రం ఎందుకు మారలేదు? పార్టీలు ఆరోపణలు చేసుకోవడం కాదు..విద్యార్థుల బకాయిలు చెల్లించాలి!చదువు అడిగిన పిల్లలకు సమాధానం కావాలి..అరెస్టులు కాదు.. స్కాలర్‌షిప్‌లు కావాలి!(https://epaper.aadabhyderabad.in/)
- మొహమ్మద్ సిరాజ్ అహ్మద్..
Aaj Ki Baath
- Advertisement -
