- తల్లిని ప్రశ్నించిన 14 ఏళ్ల బాలుడు..
- అనుమానాస్పద స్థితిలో మరణం..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృ*తి(Kanpur Boy Death) కలకలం రేపింది. తల్లి ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని బాలుడు ప్రశ్నించడంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడిని తల్లి, ఆమెకు సన్నిహితంగా ఉన్న యువకుడు కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన గురువారం (సెప్టెంబర్ 10) రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. 14 ఏళ్ల బాలుడు ఇంట్లోనే మృ*తి చెందాడు. శుక్రవారం ఉదయం బాలుడు అనారోగ్యంతో అకస్మాత్తుగా మృ*తి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులను నమ్మించేందుకు తల్లి ప్రయత్నించింది. అయితే బాలుడి మృ*తిపై గ్రామంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి తల్లికి పక్కింట్లో నివసించే ఓ యువకుడితో సన్నిహిత సంబంధం ఉందనే ప్రచారం అప్పటికే గ్రామంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలుడి మృ*తి సహజ మరణం కాదనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో గ్రామస్తులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
