- నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు..
- చివరి తేదీ అక్టోబర్ 03.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER), చండీగఢ్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను(Recruitment) విడుదల చేసింది. దీని ద్వారా 243 నర్సింగ్ ఆఫీసర్ (గ్రూప్-బి) ఖాళీలను నింపనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. అర్హులైనవారు అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు : UR- 99, SC- 36, ST- 18, OBC- 66, EWS- 24..
అర్హతలు
అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి చదివి ఉండాలి.
రూట్-ఎ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ (Hons.), రెగ్యులర్ బీఎస్సీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ పూర్తి చేసిన ఉండాలి.
రూట్-బి: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో డిప్లొమా చదివి ఉండాలి. నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్‌వైఫరీలో నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. జీఎన్‌ఎంతో పాటు 50 పడకల ఆస్పత్రిలో ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయసు
అభ్యర్థులకు వయసు 2026, అక్టోబర్ 3 నాటికి 18 నుంచి 35 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10, ఓబీసీ దివ్యాంగులకు 13, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 1500+ట్రాన్సాక్షన్ చార్జీలు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 800+ట్రాన్సాక్షన్ చార్జీలు. దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ పరీక్ష 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 100 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ఎంపికైనవారికి జీతం నెలకు రూ. 44,900 నుంచి రూ. 1,42,400 (పే లెవల్ 7) వరకు ఉంటుంది.
చివరితేదీ
దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చివరితేదీ అక్టోబర్ 3. అర్హులు, ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం, ఇతర వివరాలు వెబ్సైట్ www.pgimer.edu.inలో చూడండి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
