Tuesday, December 9, 2025
EPAPER
Homeకెరీర్ న్యూస్SridharBabu | విద్యలోనూ మార్పే ప్రభుత్వ సంకల్పం

SridharBabu | విద్యలోనూ మార్పే ప్రభుత్వ సంకల్పం

జేఎన్‌టీయూహెచ్ గ్లోబల్ అలుమ్ని మీట్‌‌లో మంత్రి శ్రీధర్ బాబు

విద్యా వ్యవస్థ(Education)లో సమూల మార్పు తేవాలన్నదే ప్రభుత్వ (Government) సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుత మార్కెట్ (Market) అవసరాలకు తగ్గట్లు తెలంగాణ యువత(Telangana Youth)ను అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులు(Human Resources)గా తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్(skilling), రీ-స్కిల్లింగ్(Reskilling), అప్-స్కిల్లింగ్‌ (Upskilling)పై ప్రధానంగా దృష్టిసారించామని చెప్పారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో జరిగిన ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అలుమ్ని మీట్‌-2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..

ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నాం. ఏఐలో బెంచ్ మార్క్ సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దు. సమాజానికి తిరిగివ్వడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలం.

జేఎన్టీయూహెచ్‌లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్‌షిప్ నెట్‌వర్క్స్, గ్లోబల్ అలుమ్ని కౌన్సిల్ ఏర్పాటుచేసేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. యువ ఇంజనీర్ల ఆలోచన విధానం మారాలి. ఉద్యోగార్థిగా కాకుండా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి. పుస్తక జ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించుకోవాలి.

కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు, రెక్టార్ డా.కె.విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News