Homeసినిమా‘Vrushakarma’ | సినిమా ట్రైలర్ నవంబర్ 25న రిలీజ్

‘Vrushakarma’ | సినిమా ట్రైలర్ నవంబర్ 25న రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య ఇంతకుముందెన్నడూ చూడని కొత్త పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’.(Vrushakarma) కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, సస్పెన్స్ కలయికతో ఒక భారీ సినిమాటిక్ స్పెక్టకల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పురాతన రహస్యాలు, మిస్టీరియస్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని ‘SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌’లో జరిగే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య ఇంటెన్స్, డిటర్మైండ్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తున్నారు. భుజంపై తాడు వేసుకుని, ఒక చేతిని ముందుకు చాపిన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.  కళ్లద్దాలు, ఒత్తైన గడ్డంతో జయరామ్ కనిపిస్తుండగా, మరోవైపు కళ్లద్దాలు ధరించిన మీనాక్షి చౌదరి చేతిలో నిప్పుతో ఉన్న వస్తువును పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ విజువల్ పోస్టర్‌కు మరింత మిస్టికల్ టచ్ ఇచ్చింది.

- Advertisement -

డార్క్, ఎర్తీ టోన్స్‌తో రూపొందించిన ఈ పోస్టర్‌లో ఫైరీ రెడ్ స్మోక్, వెలుగుతున్న ఎలిమెంట్స్, పురాతన కాలాన్ని గుర్తుచేసే వృత్తాకార చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విజువల్స్ సినిమా తెలియని రహస్యాలతో కూడిన కథా ప్రపంచాన్ని చూపించబోతున్నాయనే ఆసక్తిని పెంచుతున్నాయి. ముగ్గురు ప్రధాన పాత్రల విభిన్నమైన లుక్స్ కూడా క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాస్తవ విలన్  పాత్రలో నటిస్తున్నారు.

 రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బి. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.

నవంబర్ 25న ట్రైలర్ రిలీజ్ కానుండటంతో ‘వృషకర్మ’లోని(Vrushakarma) ఆసక్తికరమైన ప్రపంచం గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా, సత్య

టెక్నికల్ టీమ్:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోకనాథ్
సినిమాటోగ్రఫీ: రఘుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ చారి చెన్నోజు

- Advertisement -
RELATED ARTICLES

Latest News