Homeరంగారెడ్డిMahatma | జ్యోతిరావు ఫూలే కి ప్రజలు ఇచ్చిన బిరుదు మహాత్మా

Mahatma | జ్యోతిరావు ఫూలే కి ప్రజలు ఇచ్చిన బిరుదు మహాత్మా

  • సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అందోజు రవీంద్ర చారీ

అంటరానితనం,అసమానతలు,దోపిడీ,పిడన రూపు మాపటానికి సంఘ సంస్కార్త జ్యోతి రావు ఫూలే తన జీవితం అంత కృషి చేశాడు.ఆ కృషి వల్లనే ఆయనకి ప్రజలు మహాత్మ అనే బిరుదు ఇచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అందోజు రవీంద్ర చారీ అన్నారు.

మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి 135వ వర్ధంతి సందర్బంగా భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) అబ్దుల్లాపూర్ మెట్టు మండల సమితి ఆధ్వర్యంలో రావీ నారాయణ రెడ్డి ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో మండల ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అజ్మీరా హరిసింగ్ అధ్యక్షతన జరిగిన నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అందోజు రవీంద్ర చారీ మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాది రెడ్డి గార్లు హాజరై జ్యోతి రావు ఫూలే చిత్ర పాఠానికి పూల దండ వేసి నివాళ్లు అర్పించారు.

- Advertisement -
CPI Leaders Pay Tribute to Mahatma Jyotirao Phule 1

ఈ సందర్బంగా అందోజు రవీంద్ర చారీ మాట్లాడుతూ స్వతంత్రం రావటానికి కన్న ముందే దేశంలోని అణగారిని వర్గాలకి ఆత్మ గౌరవం,చదువు మరియు హక్కులు కావాలని అందరు సమానత్వంతో జీవించాలని కలలు కని వాటి సాధన కోసం జ్యోతిరావు ఫూలే కృషి చేశారని అన్నారు. అయన భార్య సావిత్రి భాయి ఫూలే కి చదువు చెప్పించి తరవాత దేశంలోని ఎంతో మంది మహిళలకి చదువు చెప్పించిన వ్యక్తి ఫూలే అని అయన పోరాట స్ఫూర్తితో నేడు సమాజంలో ఉన్న దోపిడీ,పిడన మరియు అంటరాని తనం, అసమానతలు అంతం కావాలంటే అయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో దోపిడీ పోవాలంటే ప్రపంచానికి సోషలిజమే మార్గమని అన్నారు.జనాభా దమాషా ప్రకారం బిసిలకి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News