Homeవరంగల్‌Blood Donation | రక్తదాన శిబిరం విజయవంతం.

Blood Donation | రక్తదాన శిబిరం విజయవంతం.

  • 20 మంది రక్తదాతలకు కృతజ్ఞతలు.
  • ఏకదంత గజానన మండలి ఆధ్వర్యంలో
  • యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి సహకారంతో

హనుమకొండ జిల్లా వేలేరు మండలం, మల్లికుదుర్ల గ్రామంలో ఏకదంత గజానన మండలి వారి ఆధ్వర్యంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి సహకారంతో వినాయక చవితి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం(Blood Donation Camp) విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మౌనిక అనిల్ కుమార్ ప్రారంభించి, 20మంది రక్తదాతలకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి రక్తదాతకి, గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఏకదంత గజానన మండలి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మౌనిక అనిల్ కుమార్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), రక్తదాతలు: శివకృష్ణ, విష్ణు, నిహాల్, కవిత, వెంకట్, గణేష్, శ్రీధర్, భరత్ కుమార్, వేణు, రాజు, సంతోష్, సదాశివుడు, సాంబరాజు, రమేష్, రోహిత్, మహేందర్, పోలీస్ కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, ఊరటి రవికుమార్, గజ్జెల సుమన్, అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్, ఎస్.కె ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

Mallikudurla Blood Donation Camp
- Advertisement -
RELATED ARTICLES

Latest News