Homeఆదాబ్ ప్రత్యేకంBanjara Hills | కాగితాలపై ఇల్లు.. కాసుల కోసం చెల్లు..

Banjara Hills | కాగితాలపై ఇల్లు.. కాసుల కోసం చెల్లు..

  • బంజారాహిల్స్‌లో రెసిడెన్షియల్ ముసుగులో వాణిజ్య హోరు..
  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జీహెచఎంసీ యంత్రాంగం..
  • రెసిడెన్షియల్ వినియోగానికే బిల్డింగ్ పర్మిట్.. అదే భవనంలో షోరూమ్
  • ఫిర్యాదులు, సమాచారం ఉన్నా అధికారుల చర్యలు ఎక్కడ?
  • తనిఖీలు చేసి నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన బంజారాహిల్స్‌లో నిబంధన లకు పాతర వేస్తూ సాగుతున్న అక్రమ నిర్మాణాల దందా మరో సారి బట్టబయలైంది. కాగితాలపై నివాస గృహం (రెసిడెన్షియల్) అని చెప్పి, ఆచరణలో మాత్రం కోట్లలో వ్యాపారం సాగిస్తున్న తీరు నగరపాలక సంస్థ అధికారుల వైఫల్యానికి అద్దం పడు తోంది. నివాస అనుమతులతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొంది, అదే భవనంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ?బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 7లోని హౌస్ నంబర్ 8-2-544, 544/1 (కొత్త నంబర్: 8-2-544/4/బి) భవనానికి సంబంధించి జీహెచఎంసీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు మాత్రం చట్టాన్ని ఎద్దేవా చేసేలా ఉంది. జీహెచఎంసీ అధికారిక రికార్డుల ప్రకారం ఈ భవనానికి జారీ చేసిన పత్రాలు కింది విధంగా ఉన్నాయి:

  • బిల్డింగ్ పర్మిట్ నంబర్: 5639/జీహెచఎంసీ/కేహెచ్‌బీ/ 2023 -బీపీ (తేదీ: 03-04-2023)
  • ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) నంబర్: 004917/జీహెచఎంసీ/ 02466/ఎస్డబ్ల్యూఓసీ/కేహెచ్‌బీ1/2025 (తేదీ: 27-12-2025)
  • మంజూరైన వినియోగం: సాంక్షన్డ్ ప్లాన్ మరియు కంప్లీషన్ ప్లాన్ రెండింటిలోనూ భవన వినియోగం కేవలం ‘రెసిడెన్షియల’ మాత్రమే.
  • నిర్మాణ కొలతలు: 1 సెల్లార్, 4 అప్పర్ ఫ్లోర్లు (ఎత్తు 12 మీటర్లు, మొత్తం బిల్ట్-అప్ ఏరియా 692.77 చదరపు మీటర్లు).

అయితే, నివాస గృహం కోసం మాత్రమే అనుమతి తీసుకున్న ఈ భవనంలో ప్రస్తుతం ఏకంగా ‘క్లాత్స్ షోరూమ’ (బట్టల దుకాణం)
వెలవడం వెనుక ఎవరి హస్తం ఉందనే ప్రశ్నలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. జీహెచఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమయంలో భవనం నిబంధనల ప్రకారమే పూర్తయిందని యజమానులు, డెవలపర్లు లిఖితపూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చారు.

- Advertisement -

అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కమర్షి యల్ యాక్టివి టీస్ (వాణిజ్య కార్యకలాపాలు) ఎలా ప్రారంబి óస్తారు? రెసిడెన్షి యల్ ఓసీ ఉన్న భవనంలో ఎలాంటి ముందస్తు ‘మార్పు అనుమతి’ (ఛేంజ్ ఆఫ్ యూజ్ పర్మిషన్) లేదా కమర్షియల్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా వ్యాపారం చేయడం నేరం కాదా? కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించామనో, కరెంట్ బిల్లులు ఉన్నాయనో సాకులతో నివాస భవనం స్వయంచాల కంగా వాణిజ్య సముదాయంగా మారిపోతుందా? అని మేధావులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

జీహెచఎంసీ టవర్స్‌లో నిద్రమత్తు యంత్రాంగం! : ఈ అక్రమాలపై ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, యూసుఫ్‌గూడ సర్కిల్-19 డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వంటి బాధ్యతాయుతమైన అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్న ప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అను మానాలకు తావిస్తోంది. కళ్లెదుటే నిబంధనలు ఉల్లంఘి స్తుంటే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.?

”కాగితాలపై ఇల్లు అని చూపించి, లోపల కోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నిబంధనలను తుంగ లో తొక్కిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన జీహెచఎంసీ యంత్రాంగం మౌనం వహించడం క్షమార్హం కాదు.” ఇప్పటికైనా జీహెచఎంసీ అధికారులు నిద్ర వీడి, తక్ష ణమే క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. అనధి కారికంగా నడుస్తున్న షోరూమ్‌ను సీజ్ చేయడంతో పాటు, నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News