- గోవిందా నామ స్మరణలతో మారుమ్రోగిన కురుమతి గిరులు
- పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవస్థానం
శనివారం అందులో అమావాస్య రెండు కలిసి రావడంతో కురువతి రాయుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ప్రతి నెల అమావాస్య పురస్కరించుకొని భారీగా తరలి వచ్చే భక్తులు ఈరోజు శనివారం కావడంతో అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది.ఉమ్మడి మహాబుబ్ నగర్ జిల్లాతోపాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. అక్కడక్కడా క్యూ లైన్లలో చిన్నపాటి తోపులాటలతో భక్తులు ఇబ్బంది పడ్డారు.ఎండల తీవ్రత వల్ల దాహంతో భక్తులు అల్లాడిపోయారు. ఆపసోపాలు పడి స్వామి వారిని దర్శించుకొని అన్నదాన సత్రాల్లో భోజనలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు.
- Advertisement -
