Homeఆదాబ్ ప్రత్యేకంKapra | కాప్రా, చర్లపల్లి డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు

Kapra | కాప్రా, చర్లపల్లి డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు

ఈసీ నగర్‌ మెయిన్‌ రోడ్‌, ద్వారకపురి కాలనీలో జోరుగా అక్రమ నిర్మాణాలు…

  • కాప్రా సర్కిల్‌లో చైన్‌ మెన్‌ శ్రీధర్‌ చేతివాటం…?
  • పాత భవనంపై కొత్త అనుమతితో భవన నిర్మాణం..?
  • లోపకారి ఒప్పందాల పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు..
  • అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..

హైదరాబాద్‌ కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌ పరిధిలో ఇటీవల అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.. ఈసీ నగర్‌ మెయిన్‌ రోడ్‌లో పాత భవనంపై అనుమతులకు విరుద్ధంగా అంతస్తులు ఇవ్వడం, ద్వారకపురి కాలనీలో ఇప్పటికే అనుమతులు లేని అదనపు అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్న ప్పటికి అటువైపుగా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికిష్టం వచ్చినట్టుగా భవనాలు నిర్మించడంపై అధికారుల విధుపట్ల అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

Illegal Constructions in Kapra Circle Cherlapalli Division 1

వివరాల్లోకి వెళితే.. కాప్రా సర్కిల్‌లో చైన్‌మెన్‌గా ఉద్యోగం చేపట్టిన తర్వాత శ్రీధర్‌ వ్యవహారం మరింత సందేహాస్పదంగా మారిందని స్థానికులు ఆరోపిస్తు న్నారు. నియమాల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు బయటకు చూపుతుండగా, భవన యజమానులకు లోపల ‘విూ పని విూరు చేసుకోండి’ అంటూ అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగేం దుకు అవకాశమిస్తు న్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అధికార వ్యవస్థలో ఈ రకమైన లోపకార వ్యవహారం అక్రమ నిర్మాణాలకు మరింత వేగం అందిస్తోందని ప్రజలు అంటున్నారు.

- Advertisement -
Illegal Constructions in Kapra Circle Cherlapalli Division

అదే విధంగా ద్వారకాపురి కాలనీలో జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా, కాప్రా సర్కిల్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం ‘చోద్యం చూస్తున్నట్లే’ ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రాంతీయ ప్రజలు తాము నిబంధనలు పాటిస్తూ నిర్మాణాలు చేపడితే అనుమతుల కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తుందని, కానీ కొందరికి మాత్రం అధికారులు స్వయంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపై కూడా అధికారులు మౌనం పాటిస్తే కాప్రా సర్కిల్‌లో నిర్మాణ నియంత్రణ పూర్తిగా ధ్వంసమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News