- వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదానం!
మల్కాజిగిరి: కాంగ్రెస్ పార్టీ నాయకుడు కపిలేశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకుని(Birthday Celebrations) ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కపిలేశ్వర్ను శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవతో ముడిపెట్టి నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ కమిటీ సభ్యులు సనాది శంకర్, కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బజార్ సాయి, రొట్టెల తరుణ్ కుమార్, చుంకు శ్రీను, చెన్నారెడ్డి, అరుణ్, సయ్యద్ మబ్బు, బాలరాజు యాదవ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
