(అభినాష్ ఫీజులకు సాయం)
- రోడ్డు ప్రమాదంతో తండ్రి మంచానికే పరిమితం.. కుటుంబంపై ఆర్థిక భారంStudent Education Support
- ఇంటర్ ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న కమ్మేట గ్రామ విద్యార్థి
- స్పందించిన వాట్ నెక్స్ట్ ఫౌండేషన్.. దాతల సహకారంతో ఫీజు చెల్లింపు
- వాసవి కళాశాల ప్రిన్సిపల్ రామచందర్ సైతం ఫీజులో రాయితీStudent Education Support
- విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న సేవా సంస్థలు
ఆర్థిక కష్టాలు విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకూడదనే సంకల్పంతో వాట్ నెక్స్ట్ ఫౌండేషన్ ముందుకొచ్చి ఓ నిరుపేద విద్యార్థికి అండగా నిలిచింది.చేవెళ్ల నియోజకవర్గం కమ్మేట గ్రామానికి చెందిన గొల్లగూడెం అభినాష్ ఇంటర్మీడియట్ చదువుకు ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ఉండగా,ఫౌండేషన్ స్పందించి దాతల సహకారంతో ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టింది.2023లో రోడ్డు ప్రమాదానికి గురైన అభినాష్ తండ్రి యాదయ్య మంచానికే పరిమితం కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఈ పరిస్థితుల్లో విద్యార్థి చదువు కొనసాగించేందుకు అవసరమైన ఫీజుల కోసం కుటుంబం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్ ఫౌండేషన్‌ను సంప్రదించారు.విద్యార్థి పరిస్థితిని తెలుసుకున్న ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే పలువురు దాతలను సంప్రదించి సహాయం సమీకరించారు.Student Education Support
శంకర్‌పల్లి వాసవి ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ రామచందర్‌తో మాట్లాడి విద్యార్థి పరిస్థితిని వివరించగా, ఆయన సైతం అభినాష్ దీనస్థితిని అర్థం చేసుకొని ఫీజులో రాయితీ కల్పించారు.మిగిలిన ఫీజు మొత్తాన్ని పలువురు దాతలు చిన్నచిన్న మొత్తాలుగా సమకూర్చడంతో విద్యార్థి చదువు ఆగకుండా కళాశాల యాజమాన్యానికి ఫీజు చెల్లించారు.ఈ సహకారంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు మాడపతి చంద్రమౌళి,మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్,సింగపూర్1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు,ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ అమర్,ఎర్ర,క్రైమ్ మిర్రర్ విలేఖరి రవీందర్,ప్రగతి ఎక్ష్ప్రెస్స్ విలేకరి సోప్పగాళ్ల సంజీవ,ఉపాధ్యాయుడు రాములు,సుధాకర్ తదితరులు తమ వంతు సాయం అందించారు.చిన్న మొత్తాలుగా అందించిన విరాళాలు ఓ విద్యార్థి విద్యాభవిష్యత్తుకు పెద్ద అండగా నిలిచాయి.
ఆర్థిక సమస్యల కారణంగా విద్యార్థులు చదువును మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో వాట్ నెక్స్ట్ ఫౌండేషన్ చేపట్టిన ఈ ప్రయత్నం అభినందనీయం. రాజకీయాలు,ఇతర కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం సేవా సంస్థల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.అభినాష్ చదువు కొనసాగేందుకు పలువురు కలిసికట్టుగా చేసిన ఈ సహాయం మానవత్వానికి అద్దం పట్టింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
