Homeమహబూబ్‌నగర్‌Kalwakurthy | రాష్ట్రపతి భవన్‌లో కల్వకుర్తి ఏకలవ్య విద్యార్థిని

Kalwakurthy | రాష్ట్రపతి భవన్‌లో కల్వకుర్తి ఏకలవ్య విద్యార్థిని

న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్‌ వేడుకల్లో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (ఈఎంఆర్‌ఎస్‌)కు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ.వైష్ణవి పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం వైష్ణవికి లభించింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ సుమన్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థిని పాల్గొనడం ఎంతో గర్వకారణమన్నారు. ఇది ఈఎంఆర్‌ఎస్‌ కల్వకుర్తి నియోజకవర్గంలోనే చరిత్రలో మరపురాని ఘట్టమని పేర్కొన్నారు. వైష్ణవిని ప్రిన్సిపాల్‌ సుమన్‌కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు రీనా, అనీషా, గీతు చంద్రన్‌, విద్యార్థులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News