- ఈ సమయంలో ఏ పనినీ ప్రారంభించరు..
- 48 నిమిషాల పాటు కొనసాగే దుర్ముహూర్తం..
ప్రతి రోజు పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో పాటు శుభ, అశుభ సమయాలను కూడా సూచిస్తారు. వీటిలో చాలామందికి రాహుకాలం గురించి తెలిసే ఉంటుంది. రాహుకాలంలో శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఆ సమయంలో ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. అయితే రాహుకాలంతో పాటు పంచాంగంలో పరిగణించే మరో అశుభ సమయం దుర్ముహూర్తం. సాధారణంగా దుర్ముహూర్త(Durmuhurtham) సమయంలో వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి శుభకార్యాలను ప్రారంభించకూడదని జ్యోతిష్య సంప్రదాయం చెబుతోంది.
జ్యోతిష్య పంచాంగ సంప్రదాయం ప్రకారం, రోజులో కొన్ని నిర్దిష్ట కాలాలను శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించరు. వాటిలో దుర్ముహూర్తం ఒకటి. సాధారణంగా ఒక దుర్ముహూర్తం సుమారు 48 నిమిషాల పాటు ఉంటుంది. కొన్ని వారాల్లో లేదా రోజుల్లో దుర్ముహూర్తం రెండుసార్లు కూడా ఉండవచ్చు. దుర్ముహూర్త సమయం ప్రతిరోజూ ఒకే విధంగా ఉండదు. వారం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఆధారంగా దాని సమయం మారుతుంది. అందువల్ల ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు ఆ రోజు పంచాంగంలోని దుర్ముహూర్త సమయాన్ని పరిశీలించడం ఆనవాయితీగా ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
