- తెలంగాణ ప్రజలకు శాశ్వత శత్రువు కాంగ్రెస్.
- కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్త పరిస్థితులలో తెలంగాణ.
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
విమోచన దినోత్సవం కాదు ముమ్మాటికి విలీన దినోత్సవం అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) అన్నారు. గురువారం తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 17 సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) మాట్లాడుతూ .. జాతీయ సమైక్యత, సమగ్రత కోసం నాటి నిజాం సంస్థానం భారత యూనియన్ లో 1948 సెప్టెంబర్ 17న విలీనం చేయబడ్డది కాబట్టి ఇది ముమ్మాటికి విలీన దినోత్సవంగా జరుపుకోవాలని పునరుద్ఘాటించారు.
ప్రజలు కోసం సాయుధ పోరాటం చేసి ఎందరో అమరులై ప్రజాస్వామ్యం, హక్కులు, సమైక్యత కోసం భారత యూనియన్ లో విలీనం అయినారని అందుకే జాతీయ సమైక్యత దినోత్సవంగా బి.ఆర్.ఎస్ భావిస్తోందని అన్నారు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శాశ్వత శత్రువుగా చరిత్రలో నిలిచిపోయిందని ముమ్మాటికి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. నేటి కాంగ్రెస్ పార్టీ పాలనలో కరెంట్, సాగు జలాలు, యూరియా, సంక్షేమ పథకాల కొరతతో తెలంగాణలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్, గంధం పరంజ్యోతి వనం రాములు, దిలీప్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, వెంకటస్వామి, శివరామ్ రెడ్డి, ఉంగ్లం తిరుమల్, చంద్రశేఖర్ నాయక్, జాతృ నాయక్, దేవర్ల నరసింహ, కౌన్సిలర్స్ భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి, మురళి సాగర్, స్వాతి హరిబాబు, శిరీష రమేష్ గౌడ్, పలుస శంకర్ గౌడ్, గులాం ఖాదర్ ఖాన్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, మంద రాము, మహిళా నాయకురాలు నాగమ్మ, కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
