రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లి గ్రామానికి చెందిన రాసులపల్లి స్వప్నకు సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) ద్వారా మంజూరైన రూ.25 వేల చెక్కును తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి గురువారం కల్వకుర్తిలో అందజేశారు. స్వప్న కుటుంబ సభ్యుడు ముత్యాల నరేష్ చెక్కును స్వీకరించారు. (Financial Support)
ఈ సందర్భంగాగోలిశ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..
పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం వారికి కొంతమేర భరోసా కల్పిస్తోందన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌గౌడ్, కౌన్సిలర్ రామ్‌నాయక్, మాజీ కౌన్సిలర్లు బోజిరెడ్డి, సురేష్, నాయకులు మాధవరెడ్డి, కరోనా ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
