- విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దెబ్బతీసే తప్పుడు ప్రచారాన్ని సహించం..
- తీవ్రంగా హెచ్చరించిన పరిశోధక విద్యార్ధి చల్ల రామకృష్ణ రెడ్డి..
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ గౌరవాన్ని, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వ్యక్తిత్వాన్ని(Students Support VC) కించపరిచే విధంగా జరుగుతున్న ప్రచారంపై మేము జె.ఎన్.టి.యు.హెచ్.(JNTUH) విద్యార్థులుగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తులపై, విశ్వవిద్యాలయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు..
వీజేఐటి కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీ, విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించడానికి వైస్ ఛాన్సలర్ ని కలిసినట్లు మా దృష్టికి వచ్చింది. తన బిజీ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని, వీలైతే కార్యక్రమానికి హాజరవుతానని ఆయన తెలిపిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని వివాదాస్పద ప్రచారం చేయడం తగదు. ఒక కార్యక్రమానికి హాజరుకావడంపై ఇచ్చిన సమాధానాన్ని మహిళల పట్ల వివక్షగా చిత్రీకరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
మహిళల అభ్యున్నతికి, సమాన అవకాశాలకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందనడానికి జె.ఎన్.టి.యు.హెచ్.లో మహిళా రిజిస్ట్రార్ నియామకం, మహిళా ఆచార్యులు, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు వివిధ బాధ్యతల్లో కొనసాగుతుండటం ఉదాహరణలు. మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ, వారి ప్రతిభకు తగిన గుర్తింపు కల్పిస్తున్న విశ్వవిద్యాలయంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధాకరం.
వైస్ ఛాన్సలర్ నాయకత్వంలో విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యత లభించాలని మేము కోరుకుంటున్నాము. విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు చేయడం అందరి హక్కు. అయితే, వాస్తవాలను నిర్ధారించుకోకుండా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేయడం విద్యా వాతావరణానికి మంచిది కాదు. మేము జె.ఎన్.టి.యు.హెచ్. కు చెందిన బోనఫైడ్ విద్యార్థులుగా విశ్వవిద్యాలయ గౌరవానికి, దాని అభివృద్ధికి, సమానత్వ విలువలకు అండగా నిలుస్తాము.
వైస్ ఛాన్సలర్ కి వారి మద్దతును తెలియజేశారు.. ఏ విషయమైనా వాస్తవాల ఆధారంగా పరిశీలించి, బాధ్యతాయుతంగా స్పందించాలని విద్యార్థి సమాజాన్ని వారు కోరుతున్నారు.. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను కాపాడటం, విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడటం మనందరి బాధ్యత అన్నారు.. కార్యక్రమంలో జె.ఎన్.టి.యు.హెచ్. బోనఫైడ్ విద్యార్థులు జయరాం, సాయిరాం, సంపత్, హర్ష, రామ్, దుర్గ, అరవింద్, విక్రమ్, శ్రీను, నితిన్, యశ్ వర్ధన్, శివ, గణేష్, వరుణ్, చందు, అర్జున్ సాయి, తోబి, నిఖిల్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
