Homeహైదరాబాద్‌BC JAC| 2012 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లందరికీ ఒకేసారి సీఐలుగా ప్రమోషన్లు కల్పించాలి...

BC JAC| 2012 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లందరికీ ఒకేసారి సీఐలుగా ప్రమోషన్లు కల్పించాలి…

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్BC JAC

2012 బ్యాచ్‌కు చెందిన కొంతమంది సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇప్పటికే సీఐలుగా ప్రమోషన్లు పొంది మూడు సంవత్సరాలు గడుస్తున్నా, మరికొంతమందికి ఇప్పటికీ ప్రమోషన్లు కల్పించకపోవడం అన్యాయమని (BC JAC) బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు ,
స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లింగం గౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా వరంగల్ రేంజ్ పరిధిలోని 2012 బ్యాచ్‌కు చెందిన కొంతమంది ఎస్‌ఐలు సీఐలుగా ప్రమోషన్లు పొంది ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ అదే బ్యాచ్‌కు చెందిన ఇతర ఎస్‌ఐలకు ప్రమోషన్లు కల్పించకపోవడం పట్ల ఓకే బ్యాచ్కు చెందినవారు సీనియర్ జూనియర్ ఆఫీసర్లుగా ఉండాల్సి వస్తుందన్నారు.

ఒకే బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారుల విషయంలో ప్రమోషన్లలో ఇంతటి వ్యత్యాసం ఎందుకు? ప్రమోషన్ల విషయంలో అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారుల మధ్య వివక్ష లేకుండా,రాష్ట్ర ప్రభుత్వం,డీజీపీ గారు తక్షణమే స్పందించి 2012 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లందరికీ ఒకేసారి సీఐలుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు స్వామి గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News