మొన్న IPE, నిన్న JEE, నేడు TG EAPCET లో ఆదివారం వెలువడిన ఫలితాలలో జాగృతి కళాశాల విద్యార్థులు విజయం పరంపర కొనసాగించారు. ఇంజనీరింగ్ విభాగంలో సిహెచ్ అర్జున్ 4445 ర్యాంక్, రాహుల్ 4972 ర్యాంక్ సాధించి వనపర్తి జిల్లాలో సరికొత్త రికార్డును సృష్టించి జిల్లా నెంబర్ వన్ గా నిలిచారు. వీరితోపాటు మీనా 13363 ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో కే శిల్ప 10564, ఎన్ అర్చన 14698 ర్యాంకులతో అత్యుత్తమ స్టేట్ ర్యాంక్ సాధించారు.
ఇద్దరు విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు, ఐదుగురు విద్యార్థులు 15000 లోపు ర్యాంకులు, 15 మంది విద్యార్థులు 30000 లో ర్యాంకులు సాధించడం జిల్లాకే గౌరవ కారణం గర్వకారణం. TG EAPCET లో 123 మంది కోచింగ్ తీసుకోగా 96 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగంలో అర్హత సాధించి వనపర్తి జిల్లాలో సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకులను సాధించిన విద్యార్థిని, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్, యాజమాన్య సభ్యులు శ్యాం కుమార్, సత్యనారాయణ, భాస్కర్, అధ్యాపక బృందం బొకే, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మా కళాశాల విద్యార్థులకు ఎటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లేకుండా రెగ్యులర్ ఇంటర్ విద్యతోపాటు JEE , NEET, EAPCET బ్యాచులను 26 సంవత్సరాల అనుభవం గల కార్పొరేట్ స్థాయి అధ్యాపకులతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సాధారణ విద్యార్థులతో రాష్ట్ర, జాతీయస్థాయి ర్యాంకులను సాధిస్తూ ఉమ్మడి జిల్లాలో రికార్డు సృష్టిస్తున్న ఏకైకళాశాల మా జాగృతి కళాశాల అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యజమాన్య సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
