కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారంనాడు గోరింటాకు సాంప్రదాయ కార్యక్రమాన్ని మహిళా సాధికారిత విభాగం నిర్వహించి ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ శార్వాణి అధ్యక్షతనలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీమతిభాయి ఆధ్వర్యంలో చేశారు.ప్రిన్సిపాల్ శార్వాణి మాట్లాడుతూ, ఆషాఢ, శ్రావణ మాసాలను పురస్కరించుకొని గోరింటాకు మంగళానికి, శుభానికి, సౌభాగ్యానికి, ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రతీకగా భావించే సంప్రదాయం ఉందన్నారు.
సహజసిద్ధమైన ఆకులతో కూడిన గోరింటాకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాచీనమైన పుష్ప సంస్కృతి అని, దీని వాడకం ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సరళ, సుష్మ, స్వర్ణలత, రమణమ్మ అనే విద్యార్థినీలు పల్లకి నిర్వహణలో, గోరింటాకు అలంకరణలో మరియు సాంఘిక సందేశ ప్రసారంలో భాగంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సంప్రదాయ విలువలను నిలుపుకోవడంపై గొప్ప ఆసక్తి చూపారన్నారు.
