Sunday, June 7, 2026
Homeసాహిత్యంSilence | మనసు పలికిన నిశ్శబ్దం

Silence | మనసు పలికిన నిశ్శబ్దం

మనసంటే
మాటల్లో చెప్పలేని మౌనం…!
కళ్లలో దాచుకున్న
వేల కథల గానం…!!
నవ్వుతూ కనిపించినా
లోపల తుఫానై ఉండేది..!
అందరితో కలిసిపోయినా
ఒంటరితనమే మిగిలేది…!!
అది ఆడమనసైతే
ఇంకా లోతైన సముద్రం…!
ప్రేమిస్తే ప్రాణమంతా ఇస్తుంది
బాధిస్తే నిశ్శబ్దమై పోతుంది…!!
అమ్మగా మారితే
అంతులేని త్యాగం
భార్యగా నిలిస్తే
ఇంటికే దీపస్తంభం…!!
కూతురై నవ్వితే
ఇల్లంతా వసంతం
చెల్లెలై పలికితే
మనసంతా ఆనందం…!!
కన్నీళ్లు దాచుకుని
కలలను మోసే హృదయం
అదే ఆడమనసు…
అర్థం చేసుకున్నవారికే
అది ఒక అందమైన కావ్యం…!!

- Advertisement -
RELATED ARTICLES

Latest News