- జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి
- మద్యం సేవిస్తూ కనపడితే 100 కాల్ చేయండి
- ఇకనుండి అల్లరి మోకల ఆటలకు చెక్
జగదేవపూర్: ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవిస్తే వారి బ్రతుకు భాజా ..భజంత్రీలే నని జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండలంలోని పాఠశాలలలో ఆకతాయిలు మద్యం సేవిస్తూ అల్లరి చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఎస్సై కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం రోజున జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి, మునిగడప ,జగదేవపూర్, అలీ రాజపేట్ ,తదితర గ్రామాల్లో రాత్రి సమయంలో తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో రాత్రి సమయాలలో ఎవరైనా మద్యం సేవిస్తూ కనబడినట్టయితే వెంటనే 100 కు డయల్ చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
