Saturday, April 18, 2026
Homeసాహిత్యంPhilosophy | మతలబుల మనిషి

Philosophy | మతలబుల మనిషి

మనిషెంత మతలబోడో తెలుసా..
నువ్వు జంతువు అంటే గుర్రుగా చూస్తాడు
సింహం నువ్వంటే కాలరెగిరేస్తాడు !

కొన్ని బాధకు కన్నీళ్లు రావు..
మది మదిలోనే గాయాల్ని చేస్తాయి
క్షణ క్షణం మనల్ని వేటాడుతుంటాయి !

- Advertisement -

నా మీద నాకే కోపంగా ఉంది..
విష సర్ప నరుల్ని నమ్మినందుకు..
మానసిక ప్రశాంతతను కోల్పోయినందుకు !

నేను ఎవరి కంటే ఎక్కువ కాదు..
నా కంటే ఎవరు తక్కువా కాదు..
లక్ష్య సాధనలో నాకు నేనే సాటి !

అపార శక్తి మన మాటల్లో లేదు..
మన సదాలోచనల్లో దాగి ఉంది
పంట వానతో వస్తుంది, తుఫానుతో కాదు !

మన కాళ్లు గుడి వరకు తీసుకెళ్తాయి..
నిర్మల మనస్సే దేవుడి వరకు చేర్చుతుంది
గుడిలోని విగ్రహాన్ని మది గదిలో నింపుకో !

జీవితమో రైలు ప్రయాణం..
జనాలు వస్తుంటారు, పోతుంటారు..
ఆఖరి స్టేషన్లో మనల్ని ఒంటరి చేస్తారు !

వర్షానికి పక్షులు గూట్లో దాక్కుంటాయి..
మేఘాల పైకి చేరి తప్పించుకుంటుంది డేగ..
ప్రమాదాల్ని తెలివిగా దాటుతూ కదం తొక్కు !

- Advertisement -
RELATED ARTICLES

Latest News