ఒక సమాజం సాధించిన ప్రగతిని
ఆ సమాజంలో మహిళలు
సాధించిన పురోగతిని బట్టి నేను
కొలుస్తాను . ఆత్మగౌరవమే(Self-Respect) మనిషికి
అత్యంత అవసరమైనది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
ఆకాశమంత అందం ఉన్న
ఆత్మగౌరవం లేకుంటే శూన్యం
కోట్ల ఆస్తులు కూడా పెట్టినా
ఆత్మవిశ్వాసం లేకుంటే వ్యర్థం
స్త్రీ అయినా పురుషుడైన ఒకటే
ఎవరి ఆత్మగౌరవం వారికే మకుటం
ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే
సంసార సాగరం అవుతుంది
అమృతం
ఇల్లాలుగా ఇంతి ఇచ్చే గౌరవం
యజమానిగా పురుషుడు
చూపే ఆదరణ ఈ రెండింటి కలయికే సంస్కారం అదే ప్రతి కుటుంబానికి మూలాదారం
పిల్లలకి ఆత్మస్థైర్యం నేర్పేది ఇల్లే
ఆత్మగౌరవ పాఠాలుదిద్దేది అమ్మ
నాన్నలే
తలవంచకుండా బ్రతకడం నేర్పేధి
కుటుంబమే
సమాజంలో మన వ్యక్తిత్వానికి
నిలువెత్తు అద్దం ఆత్మగౌరవం
కష్టాలుఎదురై కనులు చెమ్మగిల్లినా
కుటుంబం అండతో నిలబడు ధైర్యంగా ముందుకు సాగు
నీ గమ్యాన్ని చేరుకో
నీ ఆత్మ గౌరవమే నీకు శ్రీరామరక్ష
అదే నీ ప్రగతికి అసలైన నిర్వచనం
ధనంపోతే సంపాదించవచ్చు.
ఆత్మగౌరవం పోతే తిరిగిరాదు.
స్త్రీ పురుషుల పురస్పర గౌరవమే
కుటుంబ వ్యవస్థకు పునాది.
కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆత్మగౌరానికి విలువ ఉన్నప్పుడే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు.
ఎవరికోసమో నీ విలువను
తగ్గించుకోకు ఆత్మగౌరవమే
నీఅడుగులకు బలం.
నీవ్యక్తిత్వమే నీబలగం
అదే నీ కుటుంబానికి కిరీటం.
తలవంచకు సమాజంలో
నీవ్యక్తిత్వాన్ని సగర్వంగా
చాటుకో అపుడే చరిత్రలో
నూతన ఒరవడికి సారధివై
ఆత్మగౌరవమే ఆలంభణగా
వికసిత్ భారత్ లక్ష్యసాధనకు
ఉద్యమించాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
