Homeసాహిత్యంGrandfather Love | నీవే నా ఊపిరి

Grandfather Love | నీవే నా ఊపిరి

నీ చెక్కిలి ముద్దు ముందు..
తీపి చక్కెర చేదు అయ్యింది
నీ నవ్వుల ముందు..
గులాబీ పూలు బోసిపోయాయి
నీ చెక్కిలి చుక్క ముందు..
సింగిడి రంగులు దిగదుడుపు
నీ అమాయకత్వం ముందు..
నా చిన్నతనం చిన్నబోయింది
నీ ప్రేమ ముందు..
మా అమ్మ ఓడిపోయిందేమో
నీ ఆత్మీయ స్పర్శ ముందు..
ఆలి ఆపన్నహస్తం పలుచన
నీవు తినిపించిన ముద్ద..
అమ్మ చేతి రుచికి పోటీ అయ్యింది
చిన్న విషయానికి నీవు చేసిన మారం..
చిన్ననాటి నీ నాన్నను గుర్తు చేసింది
నీవు ఏడ్చిన ప్రతి సారి..
నా కళ్లు చెరువులైతాయి
నీ చేయి పట్టిన నడిచిన తీరు..
నా నాన్న చేయి పట్టిన చందం
నీ జన్మ తర్వాత ఇల్లు..
సరదాల స్వర్గం అయ్యింది
నా మనుమరాలి ముందు..
లోకమంతా వెలవెలబోయింది
తను లేని నా జీవిత చరమాంకం..
అంధకారం చుట్టేసిన శూన్యం
వృద్ధాప్యంలో తాతగా నేను..
2వ బాల్యంలో తడిసి ముద్దైపోయాను !

- Advertisement -
RELATED ARTICLES

Latest News