Friday, November 14, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Tribal Hostels | రూ.113 కోట్లతో మౌలిక సదుపాయాలు

Tribal Hostels | రూ.113 కోట్లతో మౌలిక సదుపాయాలు

మహిళాభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 9 ఐ.టి.డి.ఏల్లో (ITDA) ఉన్న 757 గిరిజ పాఠశాలల్లో (Tribal Schools) మౌలిక వసతుల కల్పన(Infrastructure development)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి (Minister) గుమ్మిడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) పేర్కొన్నారు. ఇందులో రూ.83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలకు మరియు రూ.30 కోట్లను గురుకుల పాఠశాలలకు (Gurukul schools) ఇవ్వడం జరిగిందన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం (Secretariat) ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై గత ఏడాది రూ.155 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు.

ఈ ఏడాది కూడా మరిన్ని మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో రూ.113 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 757 గిరిజ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 199 గురుకులాలు, 558 ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్లు ఆమె తెలిపారు. వీటన్నింటిలో ఆర్.ఓ. ప్లాంట్లు, వాష్ రూమ్ లు మరియు ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వీటన్నింటినీ టాయిలెట్లు నిర్మాణానికి ఇప్పటికే 2,012 టాయిలెట్ల(Toilets)ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్(Swachhandra Corporation) ద్వారా మంజూరు చేయడం జరిగిందని, వీటి నిర్మాణ పనులు ప్రగతిలో నున్నట్లు ఆమె తెలిపారు.

అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలుగా అన్ని వసతి గృహాల్లో ప్రిపెయిడ్ పోన్లు, కాయిన్ పోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. డిఎస్సీ ద్వారా 16 వేల పోస్టులకు పైబడి ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల అన్ని గిరిజన పాఠశాలల్లో ఉపాద్యాయలు నిండుగా ఉన్నారని, ఇప్పటికే ఉన్న 1100 మంది కాంట్రాక్టు ఉపాద్యాయులు ఎవరినీ తొలగించ కుండా వారి సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. 150 మంది మెరిటోరియస్ విద్యార్థులను గుర్తించి వారికి ఐఐటి, ఎన్.ఐ.టి., నీట్ పోటీ పరీక్షల కోచింగ్ ను పార్వతీపురం, సీతంపేట లలో అందజేయడం జరుగుచున్నదని, మరో కేంద్రాన్ని త్వరలోనే విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 వేల మినీ అంగన్ వాడీలను మెయిన్ అంగన్ వాడీలుగా మార్చి ప్రతి కేంద్రానికి ఒక టీచర్ ను, ఆయాను నియమించడం జరిగిందన్నారు. సాక్షం అంగన్ వాడీలలో దృశ్య శ్రవణ విదానం ద్వారా విద్యాబోధన చెసేందుకు అవసరమైన టీవీ, పర్నిచర్ ను కొనుగోలు చేసే నిమిత్తిం ఒక్కొక్క సాక్షం అంగన్ వాడీకి రూ.1.00 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎటు వంటి ట్రైకార్ రుణాలను మంజూరు చేయడం జరుగలేదని, అయితే గిరిజనుల జీవనోపాధిని మెరుగు పర్చేందుకు తమ ప్రభుత్వం రూ.24 కోట్లతో గోకులాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.

అదే విదంగా ట్రైకార్ రుణాలను కూడా అందజేయాలనే లక్ష్యంతో రూ.20 కోట్లను కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. ఉపాధిహామీ పథకం క్రింద 150 రోజుల పాటు పనిదినాలను గిరిజనులకు కల్పించడం జరుగుచున్నదన్నారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో 42 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించే ప్రాజక్టును చేపట్టడం జరిగిందన్నారు.

ఆయా ప్రాంతాల్లో ఉన్న చెంచులు, యానాదులకు ఆధార్ కార్డులు,రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుచున్నదని, తద్వారా వారికి గృహాలు, త్రాగునీటి సౌకర్యం, అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటు చేసే చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. క్రింద భూపట్టాలను త్వరలో అందజేసే చర్యలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సికిల్సెల్ ఎనిమియాతో బాదపడే గిరిజన మహిళలకు ఐరన్, క్యాల్షియమ్ ఔషధాలను అందజేయడం జరుగుచున్నదని, వీరికి ప్రత్యేక చికిత్స అందజేసేందుకు విశాఖపట్నం కె.జి.హెచ్.లో ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News