Saturday, May 30, 2026
Homeస్పోర్ట్స్Victory | విక్టరీ కొట్టిన వినేశ్ పొగట్..

Victory | విక్టరీ కొట్టిన వినేశ్ పొగట్..

  • 7-1 స్కోరు తేడాతో రెజ్లర్ జ్యోతిపై విజయం..
  • ప్రత్యర్థికి ఎలాంటి పాయింట్స్ ఇవ్వకుండా డామినేట్..

ఆసియా క్రీడ‌ల కోసం జ‌రుగుతున్న సెల‌క్ష‌న్ ట్ర‌య‌ల్స్ బౌట్‌లో రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్ విక్ట‌రీ కొట్టింది. ఇవాళ జ‌రిగిన ఓపెనింగ్ బౌట్‌లో ఆమె 7-1 స్కోరు తేడాతో రెజ్ల‌ర్ జ్యోతిపై విజ‌యం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో జాగ్ర‌త్త‌గా ఉన్న వినేశ్ ఆ త‌ర్వాత బౌట్ సాగుతున్న కొద్దీ మెరుగైన గేమ్‌ను ప్ర‌ద‌ర్శించింది. తొలుత పుష్ పాయింట్‌, ఆ త‌ర్వాత డ‌బుల్ లెగ్ అటాక్‌కు దిగింది.

ప్ర‌త్య‌ర్థికి ఎటువంటి పాయింట్లు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డింది. ఇక సెకండ్ పీరియ‌ల్‌లో వినేశ్ పోగ‌ట్ పూర్తిగా డామినేట్ చేసింది. రైట్ లెగ్ అటాక్‌ను వాడుకుని 3-0తో ఆధిప‌త్యం చాటింది. రెజ్ల‌ర్ జ్యోతి కూడా లెగ్ అటాక్‌కు దిగినా.. ఆ ఫైట్‌లో వినేశ్ విజేత‌గా నిలిచింది. కౌంట‌ర్ అటాక్‌లో వ‌రుస‌గా రెండు క్విక్ మూవ్స్‌తో 7-0 స్కోరు సాధించింది వినేశ్‌. జ్యోతి ఒక పుష్ ఔట్ పాయింట్ గెలుచుకున్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News