- కీసర మండల పరిధిలోని
కీసర(Keesara), అంకిరెడ్డిపల్లి గ్రామ(Ankireddypalli village) శివార్లలో గల ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో అక్రమంగా(illegally) మట్టి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం పోలీస్(police), రెవెన్యూ(Revenue), మైనింగ్(mining) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా మట్టిని తవ్వుతున్న ఇటాచీతో పాటు, 3 టిప్పర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ ఆంజనేయులు, ఎమ్మార్వో యాదిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్, భూముల్లో మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా పట్టా భూముల్లో సైతం మట్టి తవ్వకాలు జరపరాదన్నారు. మట్టి తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
