Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | ఎన్టీఆర్ మాకు స్ఫూర్తి..

Pawan Kalyan | ఎన్టీఆర్ మాకు స్ఫూర్తి..

  • కొనియాడిన పవన్ కళ్యాణ్..
  • ఎన్టీఆర్ కి ఘాన నివాళులు..

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కథానాయకుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా పక్షాన నిలిచిన గొప్ప నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ‘రెండు రూపాయలకే కిలో బియ్యం’ పథకం చారిత్రాత్మకమైనదని గుర్తుచేశారు. ఎన్టీఆర్ చూపిన అదే స్ఫూర్తితో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్ల’ను నిర్వహిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. పేదలకు అండగా నిలవాలన్న ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నామని తన సందేశంలో స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News