ఆస్ట్రేలియా(Australia)తో ఇవాళ జరిగిన మూడో టీ20లో ఇండియా విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 రన్నులు చేసింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే చేజార్చుకొని గెలిచింది. మన బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) 49 రన్నులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ(Tilak Varma) 29, అభిషేక్ శర్మ(Abhishek Sharma) 25, సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) 24 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ 74, మార్కస్ స్టాయినిస్ 64 రన్నులు చేశారు. ఇండియన్ బౌలర్లలో అర్ష్‌దీప్‌సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఒకటి పడగొట్టారు.
- Advertisment -
