Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్India Vs Afghanistan | భారీ స్కోరు చేసిన టీమిండియా..

India Vs Afghanistan | భారీ స్కోరు చేసిన టీమిండియా..

  • 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్..
  • రెండు శతకాలు సాధించిన ఇండియన్ ప్లేయర్స్..

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్‌ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌(100), సెంచరీలు సాధించగామూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్ (81), రిషబ్‌ పంత్‌ (81), వాషింగ్టన్‌ సుందర్‌(52) అర్ద శతకాలతో ఆకట్టుకున్నారు.

అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో చెలరేగాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలొక వికెట్ పడగొట్టారు. కాగా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై లభించిన అవకాశాన్ని యశస్వి జైస్వాల్సద్వినియోగం చేసుకోలేకపోయాడు.సఫీ బౌలింగ్‌లో (24) పరుగులకే వెనుదిరిగాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News