- బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ గడ్డ ప్రాంతంలో అక్రమంగా ఆవులను కోడె లేగ ను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
తాళ్ళగురిజాల ఎస్ఐ మాట్లాడుతూ వాహనాల చెకింగ్ లో పట్టుబడ్డ బొలెరో ఈ రోజున ఉదయం 07 గంటలకు పోచమ్మ గడ్డ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మహేంద్ర బొలెరో వెహికల్ TS19T 2172 నెంబర్ కలది, అతివేగంగా వెళ్తుండగా దాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో (07) ఆవులు (01) కోడెలేగా లను బంధించి వాటికి త్రాగడానికి కనీసం నీరు మరియు గడ్డి లేకుండా క్రూరంగా పరిమితికి మించి తీసుకెళ్తుండగా వెంటనే అట్టి వాహన డ్రైవరు ను విచారించగా అతని పేరు రామటెంకి పరమేష్ అని చెప్పి అతను మరియు గౌస్ ఖాన్ s/o చోటే ఖాన్ r/o పెద్దపల్లి అను ఇద్దరు కలిసి ఇట్టి ఆవులను చింతలమానపల్లి సంతలో కొనుక్కొని సిద్దిపేట లోని కసాయి వాడికి అమ్మడానికి తరలిస్తున్నారని చెప్పగా వెంటనే అట్టి ఆవులను వాహనాన్ని స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించి వారి పైన Animal cruelty and Cow slaughter Acts ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపి ఎస్ఐ


