Tuesday, November 11, 2025
ePaper
Homeనల్లగొండVeeramalla Srisailam | ‘ఇగ్నో’ ఎన్నికల్లో విజయం

Veeramalla Srisailam | ‘ఇగ్నో’ ఎన్నికల్లో విజయం

న్యూఢిల్లీ(New Delhi)లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU: ఇగ్నో) టీచర్స్ యూనియన్ ఎన్నికల్లో (Teachers Union Elections) ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌(Excecutive Committe Member)గా పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు(Ou Student Leader), అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డా.వీరమల్ల శ్రీశైలం (Veeramalla Srisailam) 150 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. శ్రీశైలం.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో చురుకైన పాత్ర పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ(Abvp) అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. శ్రీశైలం స్వగ్రామం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు. వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్న కంపెనీలను మూసివేయాలని అనేక ఉద్యమాలు చేశారు. ఇకపై సమాజ నిర్మాణం, యూనివర్సిటీ ప్రొఫెసర్ల సమస్యలు, విద్యా సంస్కరణలపై నిర్మాణాత్మక భూమిక పోషించనున్నట్లు తెలిపారు. శ్రీశైలం విజయం నేపథ్యంలో ప్రొఫెసర్లు, ఉద్యోగులు, బంధు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News