- నాడు పోచంపల్లిలో అక్రమ షెడ్డు నిర్మాణం..
- నేడు గాగిల్లాపూర్‌లో భవన నిర్మాణానికి పహారా
- ఒక్కొక్కరి నిర్మాణానికి లక్షల్లో దండుకుంటున్న వైనం
- తండాలోని ప్రభుత్వ భూమి సైతం అతని ఆధీనంలోనే
ఆయన ఓ మాజీ ప్రజా ప్రతినిధి, గత ప్రభుత్వంలో అధికార పార్టీ కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించారు.పదిమందికి ఆదర్శంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రభుత్వ భూములను ఆయన కబంధహస్తాలలో బంధించుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పనిలో నిమగ్నమయ్యాడు. అదేదో మారుమూల మున్సిపాలిటీలో అనుకుంటే పొరపాటె…సిఎంసి పరిధి దుండిగల్ సర్కిల్ గాగిల్లాపూర్‌లో ఆయన చేస్తున్న చిల్లర దందాతో బిఆరఎస్ పార్టీ పరువు పోవడం నిశ్చయంగా కనిపిస్తుంది…
సిఎంసి దుండిగల్ పరిధిలో గాగిల్లాపూర్‌కు చెందిన ఓ బిఆరఎస్ మాజీ కౌన్సిలర్ చేస్తున్న చిల్లర గంధాతో ప్రజల్లో పార్టీపై చులకన భావం ఏర్పడుతుంది. అక్రమ షెడ్లు వేయించడం, అక్రమ భవనాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదా యాన్ని గండి కొట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. గతంలో దుండిగల్ సర్కిల్ డిసిగా విధులు నిర్వహించిన కమిషనర్ ఈయన ఒకే సామాజిక వర్గానికి అవడంతో ఆయనను అడ్డుపెట్టుకొని పోచంపల్లిలో అక్రమ షెడ్లు నిర్మించి వారి వద్ద లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తండాలోని ప్రభుత్వ భూమి సైతం అతని ఆధీనంలోనే..
గాగిల్లాపూర్ తండా సర్వే నెంబర్ 684 లోని ప్రభుత్వ భూమిని తనకబంధహస్తాల్లో పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కూల్చివేతలకు యత్నించగా వారి విధులను అడ్డుకొని వారిపై దాడి చేయించడం భయబ్రాంతులకు గురిచేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయా అంశంగా మారింది.
ఇప్పటికీ ఆ స్థలం ఆయన ఆధీనంలోనే ఉంచుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని అద్దెలకు ఇచ్చి లక్షలు దండుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించి, కబ్జాకు పాల్పడ్డ అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని స్వాధీన పరుచుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆయన అండతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం..
గాగిల్లాపూర్ ప్రధాన రోడ్డు ప్రక్కన నిర్మిస్తున్న అక్రమ నిర్మాణదారుడితో మీలాకాతై అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఆ భవనంపై దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోకుండా వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికారుల తమ విధులు నిర్వహించకుండా అడ్డుపడుతూ అక్రమ నిర్మాణాల కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకొని ఆయన ఆగడాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన అక్రమంగా నిర్వహిస్తున్న స్క్రాప్ వ్యాపారంతో పాటు, అక్రమ వసూళ్ల దందా వ్యవహారాలు మరో కథనం ద్వారా ఆదాబ్ మీ ముందుకు తేనుంది.
