Saturday, May 16, 2026
Homeస్పోర్ట్స్Pakistan | పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ గా సనా..

Pakistan | పాకిస్తాన్ మహిళా క్రికెట్ కెప్టెన్ గా సనా..

  • స్క్వాడ్ ను ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు..
  • సీనియర్లకు, ప్రతిభావంతులైన జూనియర్లకు అవకాశం..

పదో సీజన్ మహిళల పొట్టి వరల్డ్‌కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. ముక్కోణపు సిరీస్‌ను, ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఫాతిమా సనా కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్లతో పాటు ప్రతిభావంతులైన జూనియర్లకు ప్రాధాన్యమిచ్చారు. అంతేకాదు రిజర్వ్ ప్లేయర్లుగా ఏకంగా ఆరుగురిని పాక్ బోర్డు తీసుకుంది.

వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ను నడిపించిన ఫాతిమా సనా పొట్టి కప్‌లోనూ కెప్టెన్‌గా ఎంపికైంది. సీనియర్లు మునీబా అలీ, అలియా రియాజ్, సదియా ఇక్బాల్, డయానా బైగ్‌, తస్మియా రుబబ్, తుబ హసన్‌లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది. అండర్‌ -19 క్రికెట్‌లో అదరగొట్టిన ఇమన్ ఫాతిమా, నటాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సైరా జుబీన్‌లు మొదటిసారి ప్రపంచకప్‌ ఆడబోతున్నారు. ఈ పదిహేను మంది పోను.. ఆరుగురు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News