- హర్షం వెలిబుచ్చిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
- మరిన్ని పతకాలు సాధించి దేశఖ్యాతిని ఇనుమడింపజేశాలి..
- ఒక ప్రకటన ద్వారా ఆకాంక్షించిన మహేష్ కుమార్ గౌడ్..
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కిలోల జూడో విభాగంలో భారత జూడో క్రీడాకారిణి అస్మితా దే స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, భారత జూడో చరిత్రలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. అత్యున్నత అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అస్మితా దేకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె ఈ విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
కఠోర శ్రమ, అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అస్మితా దే మరోసారి నిరూపించారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
