- ఇరాన్ తో శాంతి ఒప్పొందం కుదిరిందని వెల్లడి..
- ఇకపై హార్మూజ్ జలసంధి తెరిచే ఉంటుంది..
ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని, హర్మూజ్ జలసంధి ఇకపై తెరిచే ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ఓవైపు హర్మూజ్ గుండా అంతర్జాతీయ జల రవాణాకు అడ్డంకులు తొలిగాయనే విషయాన్ని చెబుతూనే.. మరోవైపు ఇరాన్‌కు హెచ్చరికలు చేశారు ట్రంప్. ఒకవేళ ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడంలో విఫలమైతే తాము తిరిగి దాడులను కొనసాగిస్తామని అమెరికా అధినేత స్ఫష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడిందని తొలుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇరాన్, అమెరికా సత్వరమే శాశ్వత ఒప్పందానికి వచ్చాయని, లెబనాన్‌పై దాడులతో సహా అన్నిరకాల సైనిక చర్యలను నిలిపి వేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని ఎక్స్ పోస్ట్‌లో షరీఫ్ తెలిపారు. కాసేపటికే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ డొనాల్ట్ ట్రంప్ ప్రకటన చేశారు. దౌత్యపరమైన చర్చలు సఫలీకృతమైందని, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎండ్ కార్డ్ పడిందని అమెరికా అధినేత స్పష్టం చేశారు.
