Friday, July 3, 2026
Homeఆరోగ్యంBone Health | ఎముకలపై ప్రభావం చూపే ఆహారపు అలవాట్లు..

Bone Health | ఎముకలపై ప్రభావం చూపే ఆహారపు అలవాట్లు..

  • విటమిన్ డీ శరీరానికి ఎంతో అవసరం..
  • తగినంత సూర్యరశ్మి అందుకోవాలి..

ఎముకల ఆరోగ్యం వయసు పెరిగే కొద్దీ మాత్రమే ప్రభావితమవుతుందని చాలామంది భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటి అంశాలు కూడా ఎముకల బలంపై కీలక ప్రభావం చూపుతాయి. ప్రతిరోజూ పాటించే కొన్ని మంచి అలవాట్లు ఎముకల సాంద్రతను పెంచి, భవిష్యత్తులో ఎముకలు బలహీనపడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ డి శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల శోషణకు ఎంతో అవసరం.

ఈ రెండు ఖనిజాలు ఎముకల నిర్మాణం, దృఢత్వానికి కీలకం. విటమిన్ డి లోపిస్తే రక్తంలో కాల్షియం స్థాయిని నిలబెట్టేందుకు శరీరం ఎముకల్లోని కాల్షియాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీంతో కాలక్రమేణా ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందువల్ల తగినంత సూర్యరశ్మి పొందడం, అవసరమైనప్పుడు విటమిన్ డి ఉన్న ఆహారం లేదా వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News